ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం కుంభకోణం కేసులో తన అరెస్టును సవాలు చేశారు. ఈ కేసులో ఆదివారం ఆయన్ను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఐదురోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ దిల్లీ కోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిసోడియా అభ్యర్థనను అత్యవసర విచారణకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ముందు ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది.