ఆంధ్రప్రదేశ్ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం నేతలు ఈరోజు రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డిని కలిశారు. తమ ఉద్యమానికి సంబంధించిన నోటీసులను ఆయనకు అందజేశారు. ఉద్యోగుల ఆర్థిక, ఇతర సమస్యల పరిష్కారానికి ఉద్యమం చేపడుతున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. మార్చి 9 నుంచి ఉద్యమ కార్యాచరణ ప్రారంభిస్తామని వెల్లడించారు.తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకుంటే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.