ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరైంది. కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్, అరుణ్ రామచంద్ర పిళ్లై, ముత్తా గౌతమ్, సమీర్ మహేంద్రులకు రూస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ స్కామ్‌కు సంబంధించి ఈడీ నమోదు చేసిన కేసులో ముత్తా గౌతమ్‌తోపాటు ఇతర నిందితులు రిమాండ్‌లో ఉన్నారు. కాగా, సీబీఐ కేసులో ఇద్దరు నిందితులు ఇప్పటికే బెయిల్‌పై ఉన్నారు.