కాకుమాను మండలం వల్లూరుకు చెందిన అన్నదాత ప్రత్తిపాటి ధనంజయరావు (38) అయిదు ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. రెండవ పంటగా మినుము, పెసర వేశారు. రెండేళ్లుగా పంట నష్టం వచ్చింది. దీనికితోడు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో కాకుమాను వెళ్లి వస్తానని సోమవారం ఇంటి నుంచి బయలుదేరారు. పెదనందిపాడు సమీపంలో నూతివారి చెరువు వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి తండ్రి వెంకటరత్తయ్య ఫిర్యాదు మేరకు మంగళవారం ఎస్సై అబ్దుల్రెహమాన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.