ఓ బాలుడు హైడ్ అండ్ సీక్ ఆడుతూ పొరపాటుగా పరాయిదేశం చేరుకున్న ఘటన బంగ్లాదేశ్ లో చోటుచేసుకుంది. పోర్టు ఏరియాలో నివసించే ఎండీ రతుల్ ఇస్లామ్ ఫహిమ్ అనే బాలుడు జనవరి 11న తోటి పిల్లలతో ఆడుకుంటూ సమీపంలోని కంటైనర్ లో దాక్కున్నాడు. ఆ కంటైనర్ ను ఓడలోకి ఎక్కించి మలేసియాకు తరలించారు. జనవరి 17న ఓడ మలేషియా చేరుకోగా, అక్కడి అధికారులు బాలుడ్ని గమనించి బంగ్లాదేశ్ హైకమిషన్ తో మాట్లాడి స్వదేశానికి పంపించారు.