ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రేపు విశాఖపట్నం వెళ్లనున్నారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనబోతున్న జగన్ ఒకరోజు ముందుగానే విశాఖ చేరుకోనున్నారు. మూడు రోజుల పాటు ఆయన విశాఖపట్నంలోనే ఉంటారు. ఈ సదస్సు వేదికగా పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర వనరులను వివరించి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమ్మిట్‌కు మన దేశానికి చెందిన పారిశ్రామికవేత్తలనే కాకుండా విదేశీ పారిశ్రామికవేత్తలను కూడా ప్రభుత్వం ఆహ్వానించింది.