త్రిపురాంతకేశ్వర స్వామి, బాలా త్రిపురసుందరీదేవి ఆలయాల వద్ద ఏడాది పాటు పలు దుకాణాల నిర్వహణకు ఆలయ అధికారులు బహిరంగ వేలం బుధవారం నిర్వహించారు. కొబ్బరి కాయల విక్రయానికి రూ. 20. 22, అమ్మవారికి, స్వామి వారికి సమర్పించిన వస్త్రాలకు రూ. 4. 44, కొబ్బరి చిప్పలకు రూ. 3. 95, అల్పాహారం హోటల్ నిర్వహణకు, శీతల పానియాల విక్రయానికి రూ. 2. 30 లక్షల ఆధాయం లభించిందని ఈవో చెన్నకేశవరెడ్డి, చైర్మన్ పి. పద్మజా మల్లికార్జున్ తెలిపారు. వేలంలో ట్రస్టు బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.