రాళ్లపాడు ఎడమ కాలువ అభివృద్ధి ఆయకట్ట రైతులకు కలగానే మిగులుతుంది. కాలవ పొడిగింపు విస్తరణ ప్రతిపాదనకు పదేళ్లు నిండిన నేటికి అడుగు ముందుకు పడని పరిస్థితి. ఫలితంగా గడిచిన రెండు మూడేళ్లుగా ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్న కాలువ పరిధిలోని రైతులకు ప్రయోజనం చేకూరని దుస్థితి నెలకొంది. కందుకూరు నియోజకవర్గం లోని కొన్ని మండలాలకు ఉదయగిరి నియోజకవర్గంలోని కొండాపురం మండలానికి కీలకం రాళ్లపాడు జలాశయం. సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో హామీ ఇచ్చిన ఆచరణ దిశగా అడుగు పడకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం అవుతుంది.