కర్ణాటకలో అధికార బీజేపీకి షాక్ తగిలింది. 40% కమిషన్ ముట్టనిదే పనులేవీ కావంటూ ఇప్పటికే సీఎం బొమ్మైపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో BJP ఎమ్మెల్యే విరూపాక్షప్ప కొడుకు ప్రశాంత్ రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హాండెడ్‌గా పట్టుబడ్డాడు. అంతేకాక ఆయన ఆఫీస్‌లో మరో రూ. కోటీ 40 లక్షలు, ఇంట్లో రూ. 6 కోట్లు లభించటంతో అధికారులు సీజ్ చేశారు. శుక్రవారం ఉదయం పోలీసులు ప్రశాంత్‌ని అరెస్ట్ చేశారు.