పదో తరగతి విద్యార్థితో ఓ ఉపాధ్యాయురాలు పారిపోయింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని చందానగర్‌లో జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న టీచరమ్మ(26) 10th క్లాస్ విద్యార్థి(15)తో ప్రేమాయణం నడిపింది. ఈక్రమంలో ఇద్దరూ ఒకేసారి కనిపించకుండా పోయారు. బాలుడు టీచర్‌తో కలిసి వెళ్లాడని, వారిద్దరూ ప్రేమలో ఉన్నట్లు పోలీసులు విచారణలో తెలుసుకున్నారు. టీచరుకు పెళ్లి సంబంధాలు చూస్తున్న క్రమంలోనే వారిలా చేసినట్లు సమాచారం.