రేపల్లె రైల్వేస్టేషన్ ను రైల్వే డిఆర్ఎం రామకృష్ణ శనివారం పరిశీలించారు. అమృత్ భారత్ పథకం కింద రేపల్లె రైల్వే స్టేషన్ ఎంపికైనట్లు ఆయన తెలిపారు. రైల్వేస్టేషన్ల ఆధునీకరణలో భాగంగా గుంటూరు డివిజన్లో 16 రైల్వే స్టేషన్లను గుర్తించామని వాటిలో రేపల్లె ఒకటని తెలిపారు. రేపల్లె బస్టాండ్ వైపు ఉన్న రైల్వే ద్వారాన్ని సైతం అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు.