అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం, పెద్దపప్పూరు మండలం లో తాడిపత్రి నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా చేపట్టిన "ప్రజా సంక్షేమ యాత్ర" బొందల దిన్నే గ్రామం నుంచి ప్రారంభమై పెద్ద ఎక్కలూరు, కొండాపురం గ్రామాల మీదుగా చెర్లోపల్లి గ్రామం వరకు సాగింది. ఈ సందర్బంగా ఆదివారం స్థానిక శాసనసభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపట్టిన పాదయాత్రకి మాజీ మంత్రి, శ్రీసత్యసాయి జిల్లా వై. యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర నారాయణ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa