ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. నరసాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు కుమార్తె డాక్టర్ సింధు వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు. కలగంపూడి గ్రామంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా నూతన వధూవరులకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ రిసెప్షన్లో ఏపీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.