అనారోగ్య సమస్యలతో వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జియ్యమ్మవలస మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు గోర్లి గ్రామానికి చెందిన ఎం. తవిటమ్మ నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నా తగ్గకపోవడంతో మనస్తాపానికి గురై ఆదివారం దోమల మందు తాగి ఆత్మహత్యానికి ప్రయత్నించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గుర్తించిన భర్త అంబులెన్సులో ఆసుపత్రికి తీసుకెళ్లాడు.