ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్ జిల్లాలో భార్యను హత్య చేసి ముక్కలుగా నరికాడు ఓ భర్త. పవన్ అనే వ్యక్తి తన భార్యపై అనుమానం రావటంతో చంపేయాలనుకున్నాడు. పిల్లలిద్దరినీ స్వగ్రామంలో విడిచిపెట్టి వచ్చి భార్యను చంపేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఇంట్లో వాటర్‌ట్యాంక్‌లో పడేశాడు. ఇది జరిగి 2 నెలలైంది. తాజాగా ఓ చోరీ కేసులో పవన్ ఇంటిని శోధించిన పోలీసులు ట్యాంక్‌లో శవాన్ని చూసి నిలదీసే సరికి నిజం ఒప్పుకున్నాడు.