ఆమదాలవలస పట్టణం మోనింగ్ వారి వీధి2 సచివాలయం పరిధిలో మంగళవారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. డా. వైఎస్సార్ కంటివెలుగు అంధత్వ నివారణ లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఆప్తాల్మిక్ అధికారి కే ఈశ్వర రావు తెలిపారు. 60సం. వయస్సు నిండిన వారికి ఈ పరీక్షలు చేసి ఉచితంగా కళ్లద్దాలు, మందులు అందించామన్నారు. ఈ శిబిరం ఈ నెల11 వరకు కొనసాగుతుందన్నారు.