మన దేశంలో చాలా మంది ర్యాపిడోలో పార్ట్ టైం ఉద్యోగంగా బైక్ ట్యాక్సీ నడుపుకుంటున్నారు. తాజాగా ఓ ఆటో డ్రైవర్ ర్యాపిడో ట్యాక్సీ డ్రైవర్ పై దౌర్జన్యానికి పాల్పడ్డ ఘటన బెంగళూరులో జరిగింది. ఇందిరానగర్ మెట్రో స్టేషన్ వద్ద ర్యాపిడో డ్రైవర్ ఫోన్ ను ఆట్ డ్రైవర్ పగలగొట్టి, వైట్ కలర్ నెంబర్ ప్లేట్ ఉన్నవాడు బైక్ ట్యాక్సీ నడపడం ఏంటని దాడికి యత్నించాడు. ఆటో డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.