చదువుకు వయసుతో సంబంధం లేదని ఓ 45 ఏళ్ల మహిళ మరోసారి నిరూపించారు. బీహార్ లోని నలందకు చెందిన శివర్తి దేవి అనే మహిళ ఇంటిపనులు చూసుకుంటూ, తన కోడళ్లతో కలిసి పరీక్ష రాశారు. అక్కడి ప్రభుత్వం 'ముఖ్యమంత్రి అక్షర్ అంచల్ యోజన' కింద మహిళలకు ప్రాథమిక పరీక్ష రాసే అవకాశం కల్పిస్తోంది. దీంతో శివర్తి దేవి తన నలుగురు కోడళ్లు శోభా, సీమా, వీణా, బింది లతో కలిసి ఆరునెలల పాటు శిక్షణ తీసుకొని ఆదివారం పరీక్ష రాశారు.