సాధారణంగా మనం చెప్పులు ఇంటి బయటే విడిచి లోపలికి వెళతాం. అలా చేయడమే శుభప్రదమని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లోకి చెప్పులు వేసుకుని వెళితే శని ప్రభావం ఉంటుందట. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి మెయిన్ డోర్ దగ్గర పాదరక్షలు ఉంచరాదు. ఇంటి ప్రధాన ద్వారం పాజిటివ్ ఎనర్జీకి ప్రవేశ ద్వారం. అందుకే ఇంటి మెయిన్ డోర్ ఎప్పుడూ అందంగా, బలంగా ఉండేలా చూసేందుకు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.