పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల ప్రచార కార్యక్రమంలో భాగంగా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామంలో 10వ క్లస్టర్ ఇంచార్జ్ ఈదర వెంకట కృష్ణారావు, 48వ యూనిట్ ఇంచార్జి వలేటి పాండురంగారావుతో కలిసి అమ్మనబ్రోలు గ్రామములోని స్కూల్ టీచర్లను, పట్టభద్రులను తమ ఓటు హక్కును ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేయవలసినదిగా టీచర్లను, పట్టభద్రులను ప్రతి ఇంటికి వెళ్లి బుధవారం ఓటు అడగటం జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రామపార్టీ ప్రధాన కార్యదర్శి ఈదర సుబ్బారావు టిడిపి నాయకులు ఈదర అమరనాథ్ , శ్రీకాంత్, ఆంజనేయులు పాల్గొనడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa