కడప జిల్లా ఒంటిమిట్ట మండలం పెన్న పేరూరు పంచాయతీలో ఓబులేసు కోనలో అడ్డగోలుగా జరిగిన భూ ఆక్రమణ చూసి ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి విస్తుపోయారు. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేయడానికి అనువైన స్థలాన్ని పరిశీలించేందుకు మంగళవారం ఆయన అక్కడికి వెళ్లారు. ప్రభుత్వం నుండి ఎలాంటి అధికారిక అనుమతులు పొందకుండా యంత్రాలతో అక్రమార్కులు యంత్రాలతో కొండలు, గుట్టలు తొలగించి ఎకరాల కొద్ది భూమిని ఆక్రమించారని తెలుసుకొని హౌరా ఇదేమి చోద్యం అంటూ ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ ఓబులేసు కోనలోని కొండపై హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.