ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలకు సమ ప్రాధాన్యం ఇవ్వనిదే దేశం, సమాజం పురోగతి సాధించలేవు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2023, 06:09 PM

 మహిళా దినోత్సవాన్ని హైకోర్టులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా న్యాయమూర్తులు జస్టిస్‌ బి.ఎ్‌స.భానుమతి, జస్టిస్‌ వడ్డిబోయన సుజాత, జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి, సీనియర్‌ న్యాయవాది భాస్కర లక్ష్మిని సీజే ఘనంగా సన్మానించారు. జ్ఞాపికలను అందజేశారు. జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా మాట్లాడుతూ.. సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు సమ ప్రాధాన్యం ఇవ్వనిదే దేశం, సమాజం పురోగతి సాధించలేవన్నారు. దేశంలో రాష్ట్రపతి, గవర్నర్లు, న్యాయమూర్తులుగా మహిళలు ఉన్నారన్నారు. వారి సంఖ్య మరిం త పెరగాల్సిన అవసరం ఉందన్నారు. హైకోర్టులో మహిళా న్యాయవాదుల సంఖ్య ప్రస్తుతం 28 శాతానికి మించిందన్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ గంటా రామారావు, డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ హరినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa