అడవి నుంచి దారితప్పి ఊరిలోకి వచ్చిన నాలుగు పులిపిల్లల తల్లిని టీ-108గా గుర్తించామని అటవీ అధికారులు చెప్పారు. అయితే ఆ పులి జాడను మాత్రం ఇంకా గుర్తించలేదు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం గ్రామంలో సోమవారం కనిపించిన నాలుగు పులి కూనలను అటవీ అధికారులు మంగళవారం తల్లిపులి వద్దకు చేర్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సోమవారం రాత్రి పెద్దగుమ్మడాపురం పరిసర అటవీ ప్రాంతంలో 40 ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలను ఏర్పాటు చేయడమే కాకుండా పులి పాదముద్రల కోసం గాలించినా ఫలితం లేకపోయింది. ఈ నేపఽథ్యంలో మంగళవారం పెద్దగుమ్మడాపురం నుంచి రెండు కిలోమీటర్ల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో మంగళవారం మరో 100 ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అవసరమైతే డ్రోన్ కెమెరాను కూడా వాడాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం నాలుగు పులికూనలకు తిరుపతి జూపార్క్ పశువైద్యుల పర్యవేక్షణలో సపర్యలు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa