ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆమె జీవితం అందరికీ ఆదర్శం: మహిళా దినోత్సవం రోజున సీఎం ట్వీట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2023, 06:16 PM

 తమ ప్రభుత్వం మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉద్యోగ సాధికారతలపై.. దేశంలోని మరే ప్రభుత్వమూ పెట్టనంతగా దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. మహిళల అభ్యున్నతే ఏ సమాజం ప్రగతికైనా కొలమానం అని.. ఆయన వ్యాఖ్యానించారు.  జగనన్న అమ్మ ఒడి, ఆసరా, చేయూత, 30 లక్షల ఇళ్ల పట్టాలు-22 లక్షల ఇళ్ల నిర్మాణం, విద్యా దీవెన, వసతి దీవెన, సంపూర్ణ పోషణ వంటి పథకాలతో.. గర్భస్త శిశువు నుంచి పండు ముదుసలి వరకు.. ప్రేమ చూపిస్తున్నామని సీఎం వివరించారు.


అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. రాష్ట్ర మహిళలకు శుభాకాంక్షలు చెప్పిన జగన్.. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ మహిళ గురించి ప్రస్తావించారు. వనిత జీవితం అందరికీ ఆదర్శమని సీఎం ట్వీట్ చేశారు. 'జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని.. తన బిడ్డల కోసం ఒంటరి పోరాటం చేస్తూ.. సమాజానికి ప్రేరణగా నిలిచిన చిత్తూరు జిల్లాకు చెందిన వనిత జీవితం మనకు ఆదర్శం. వనితకు, రాష్ట్ర ప్రజలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు' అని జగన్ ట్వీట్ చేశారు.


'21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్‌లోనే అవతరించేలా నిర్ణయాలు తీసుకున్నాం. రాజకీయ పదవుల్లో కూడా చట్టాలు చేసి మరీ సగభాగం ఇచ్చింది మన ప్రభుత్వమే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క కుటుంబం, మొత్తం సమాజం ఆడబిడ్డల పట్ల మరింత గౌరవం, శ్రద్ధ కనబర్చేలా నిర్ణయాలు తీసుకోవాలి' అని సీఎం జగన్‌ అభిప్రాయపడ్డారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa