ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ టీడీపీలో చేరే ప్రసక్తే లేదు...శిల్పా చక్రపాణిరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2023, 08:32 PM

తాను మళ్లీ టీడీపీలోకి వెళ్లే ప్రసక్తేలేదని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి స్పష్టంచేశారు. ఇదిలావుంటే శిల్పా చక్రపాణిరెడ్డి మళ్లీ సైకిల్ ఎక్కుతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆ ప్రచారంపై స్పందించిన చక్రపాణి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలను పదే పదే చెప్పి.. నిజమని ప్రచారం చెయ్యడం చంద్రబాబుకు అలవాటే అని ఫైర్ అయ్యారు. తాను కూడా ఆ స్కూల్ నుంచే వచ్చానని వ్యాఖ్యానించారు. నారా లోకేష్ భవిష్యత్తుపై చంద్రబాబు ఆందోళనతో ఉన్నారని.. లోకేష్‌కు బుర్ర లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ఏమి మాట్లాడుతున్నారో ఎవ్వరికీ అర్థం కాదని శిల్పా చక్రపాణి రెడ్డి ఎద్దేవా చేశారు.


'తెలుగుదేశం పార్టీలో చేరతానని వస్తున్న వార్తలు నిజం కాదు. ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేసి, వైసీపీలోకి వచ్చాను. అలాంటి నేను మళ్లీ టీడీపీలోకి ఎలా వెళ్తాను. మంత్రి పదవి రావచ్చు, రాకపోవచ్చు.. నాకు పదవి ముఖ్యం కాదు. పదవి రాకున్నా ఎప్పుడూ అసంతృప్తి చెందలేదు' అని శిల్పా చక్రపాణిరెడ్డి స్పష్టం చేశారు. 'సీఎం జగన్ జనంలోకి వస్తే ఎవ్వరూ తట్టుకోలేరు. సీఎం కావడంతో బిజీగా ఉన్నారు. ఉద్యోగులు ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. కానీ, సీఎం జగన్‌ అందరికీ న్యాయం చేస్తారు నెలాఖరులోగా శుభవార్త చెబుతారనే నమ్మకం ఉంది' అని శిల్పా చక్రపాణి రెడ్డి వ్యాఖ్యానించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa