గుంటూరు జీజీహెచ్ లో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు కొత్తపేట పోలీసులు తెలిపారు. బుధవారం ఓ వ్యక్తి అనారోగ్యంగా ఉందంటూ జీజీ హెచ్ లో అడ్మిట్ అయి చికిత్స పొందుతూ మరణించాడు. మృతుని వయసు సుమారు 43 సంవత్సరాలు ఉంటుందని చికిత్స పొందుతున్న సమయంలో ఆయన వెంట కుటుంబ సభ్యులు ఎవరూ లేరని పోలీసులు పేర్కొన్నారు. తెలిసినవారు కొత్తపేట పోలీస్ స్టేషన్ కు తెలపాలన్నారు.