రాష్ట్రంలో మహిళల రక్షణకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చట్టాలు తీసుకురావటమే కాకుండా సత్వర శిక్షలు అమలు చేసేందుకు దిశా చట్టాన్ని రూపొందించటం హర్షనీయమని మహిళలందరూ సీఎం కు రుణపడి ఉన్నారని ఎమ్మెల్యే కిలారి రోశయ్య అన్నారు. బుధవారం చేబ్రోలు మండలం కొత్త రెడ్డి పాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో కేశవరెడ్డి శ్రీరెడ్డి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కిలారి రోశయ్య కు మహిళ ప్రజా ప్రతినిధులు సన్మానం చేశారు.