సిఎం జగన్ మోహన్ రెడ్డి పట్ల ప్రజ లకు ఉన్న ఆదరణను, పరిశ్రమలు తీసుకురావడం చూసి విపక్ష పార్టీలు ఓర్వలేక పోతున్నాయని గుంతకల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకట్రామి రెడ్డి అన్నారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజవంతంగా ముగిసిన సంధర్భంగా బుధవారం గుంతకల్లులోని తన క్యాంపు కార్యా లయంలో ఎమ్మెల్యే, వైకాపా నాయకులు సిఎం జగన్ మోహన్ రెడ్డిని అభినందిస్తూ కేకు కోసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విశాఖను పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం విశేష కృషి చేస్తోంద న్నారు. అది చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయని అన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో అధిక ప్రాధాన్యత ఇచ్చింది వైకాపా ప్రభుత్వమే అన్నారు. ఉద్యోగుల బకాయిలను ఈనెల 31 తేదీ లోపు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ సమావేశంలో వైకాపా నాయకులు ఎం. రాజశేఖర్, యుగంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.