ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగనన్న లే అవుట్ లలో నీటి వసతి కల్పించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 09, 2023, 11:35 AM

గుంతకల్లు పట్టణ శివారులోని దోని ముక్కల రోడ్డులో ఏర్పాటు చేసిన జగనన్న లే అవుట్ లలో పేదలు నిర్మించుకుంటున్న ఇళ్లకు నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి బి. సురేష్ డిమాండ్ చేశారు. బుధవారం జగనన్న లే అవుట్లలో సీపీఐ ఎంఎల్ న్యూడె మోక్రసీ నాయకులు ఇళ్ల నిర్మాణా లను పరిశీలించారు. పేదలు ఇళ్లను నిర్మించుకునేందుకు అధికారులు బోర్లు వేశారే కానీ నీరు లేదన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం పేదలు 400 రూపాయలు వెచ్చించి ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించు కుంటున్నారని అన్నారు. ఇళ్ల నిర్మాణాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అధికారులు పరిష్కారం చేయాలని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com