ఈనెల 13వ తేదీన జరగనున్న శాసనమండలి ఎన్నికల సందర్భంగా అల్లర్లు రేపే పధక రచన చేస్తున్నారన్న సమాచారం అందడంతో మార్టూరు మండలం నాగరాజు పల్లెకు చెందిన చెరుకూరి రామారావు, మురికిపూడి రవి. దిడ్ల బోస్ అనే ముగ్గురు రౌడీషీటర్ లను ఎస్ఐ కమలాకర్ బుధవారం రాత్రి బైండోవర్ చేసుకున్నారని బాపట్ల డిఎస్పి శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే పలువురిని కమలాకర్ ఈ విధంగా బైండ్ ఓవర్ చేశారని ఆయన చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఎవరు శాంతిభద్రతలకు భంగం కలిగించినా, గొడవలు రేపినా కఠిన చర్యలు తప్పవని డిఎసీ హెచ్చరించారు.