దేవరాపల్లి మండలం గురువారం రాత్రి సంజీవ మెట్టలో ఎదురెదురుగా బైక్ లు ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సదరు ఘటన స్థలాన్ని డిప్యూటీ సియం శుక్రవారం ఉదయం పరిశీలించారు. సంజీవపురం గ్రామానికి చెందిన కోటాన అప్పలనాయుడు మృతి చెందడంపై అయన విచారం వ్యక్తం చేసి, చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి వారికి ఫోన్ చేసి మాట్లాడారు. ఘటనకు సంబంధించి స్థానిక ఎస్సై ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.