కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డులలో వేర్వేరు వివరాలు ఉండి ఇబ్బంది పడుతున్న వారికి శుభవార్త చెప్పింది. ఆధార్ కార్డులో అడ్రస్ సహా ఏవైనా వివరాలు మార్చుకుంటే, మిగతా డాక్యుమెంట్లలో మార్పులకై కార్యాలయాల చుట్టూ తిరగకుండా, అన్నింట్లోనూ ఆటోమేటిక్ గా వివరాలు అప్ డేట్ అయ్యేలా సరికొత్త వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలిపింది.