దేశంలో H3N2 వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కర్ణాటకలో మొట్టమొదటిగా వైరస్ బారిన పడ్డ వ్యక్తి తాజాగా మృతిచెందాడు. జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్న 85 ఏళ్ల వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా H3N2 వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆ వ్యక్తికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా, నేడు కన్నుమూశాడు. కాగా, కర్ణాటకలో ఇప్పటివరకు 6 మందికి H3N2 వైరస్ సోకింది.