గుంటూరు: అమ్మమ్మ ఇంట్లో మనుమరాలు చోరీకి పాల్పడినట్లు అరండల్ పేట పోలీస్ స్టేషన్లో గురువారం కేసు నమోదయింది. గుంటూరు నగరపాలక పరిధిలోని కొండయ్య కాలనీలో మల్లేశ్వరి అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమె బయటకు వెళ్లిన సమయంలో మనవరాలు రాజ్యలక్ష్మి అమ్మమ్మ ఇంటికి వెళ్లడంతో బీరువా తాళాలు వేయకపోవడాన్ని గమనించి అందులో 19 సవర్ల బంగారు ఆభరణాలు అపరించుకుపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.