పల్నాడు జిల్లా డీఈవో వెంకటప్పయ్య ఉపాధ్యాయుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఉపాధ్యాయులు చేస్తున్న పోరాటంలో భాగంగా నేడు పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్ ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ అధ్యక్షులు, ఫ్యాక్టోకో చైర్మన్ టి. చంద్రయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.