కసింకోటలో గురువారం ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న సీతంరాజు సుధాకర్ కు మద్దతుగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. వైసీపీ అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు ఆధ్వర్యంలో కసింకోటలోని రెల్లివీధి, కస్పావీధి, గవరపేట, ఇంద్రకాలనీ తదితర ప్రాంతాలలో గురువారం మంత్రి అమర్నాథ్ ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల వద్దకు వెళ్లి సీతంరాజు సుధాకర్ కు ఓటు వేయాలని అభ్యర్థించారు.