తమిళనాడులో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. కోయంబత్తూర్ జిల్లా నల్లూర్ లోని ఓ ఇంట్లో ఫ్రిడ్జ్ అకస్మాత్తుగా పేలింది. దీంతో మంటలు చెలరేగడంతో శబరీనాథ్ అనే పోలీస్ ఇన్ స్పెక్టర్ తో పాటు శాంతి అనే మహిళ మృతిచెందారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసి మృతదేహాలను బయటికి తీసుకొచ్చారు. కాగా, ఫ్రిజ్ పేలడానికి గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.