గుంటూరు: యువత వైద్యుల ప్రిస్క్రిప్షన్ తో సంబంధం లేకుండా మెడికల్ షాపుల నుంచి మత్తును కలిగించే టాబ్లెట్లు, సిరప్ లు కొంటున్నట్లు పలు సందర్భాల్లో తమ దృష్టికి వచ్చిందని శుక్రవారం ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. మెడికల్ షాపులో తనిఖీలు నిర్వహించేందుకు ఔషధ నియంత్రణ మండలి అధికారులతో కలిసి దాడులు నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు కూడా లేఖ రాయనున్నామని తెలిపారు.