మార్చి నెల 13వ తేదీన పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపద్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎలక్టోరల్ అధికారి , ఓటు హక్కు కలిగిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు మంజారు చేసిందని జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున తెలిపారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని ప్రైవేటు యాజమాన్యాలు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు ఆయా సంస్థలలో పని చేసే ఉద్యోగులు ఏదైనా పట్టబద్రుల నియోజక వర్గం లో ఓటు హక్కు కలిగి ఉంటే వారు 13 వ తేదీ ఉదయం 8 నుండి సాయింత్రం 4 గంటల లోపు ఓటు హక్కు వినియో గించుకునేందుకు గానుఆ మేరకు ఆలస్యాన్ని అనుమతించాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.