శృంగవరపుకోట నియోజకవర్గం లక్కవరపుకోట మండల వైస్ ఎంపీపీ దండేకర్ కుమారి శుక్రవారం మృతి చెందారు. ఈమె గత కొంతకాలంగా పచ్చ కామెర్ల వ్యాధితో బాధపడుతూ శృంగవరపుకోట పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు వైస్ ఎంపీపీ కుమారి కుటుంబ సభ్యులు తెలిపారు. వైస్ ఎంపీపీ కుమారి అతి చిన్న వయసులో లక్కవరపుకోట మండల వైస్ ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించి, తనదైనశైలిలో ప్రజలతో మమేకమై వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేశారని ఈ సందర్భంగా లక్కవరపుకోట మండలంలో గల ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. వైస్ ఎంపీపీ కుమారి మృతి పట్ల ఎంపీపీ శ్రీనివాసరావు, తాసిల్దార్ రామకృష్ణ తదితర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.