కృష్ణా జిల్లా మచిలీపట్నంలో శనివారం పరాస్ పేట సెంటర్ నందు వైసిపి యూత్ జోన్ ఇంచార్జ్ పేర్ని కృష్ణమూర్తి ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది.సీఎం జగన్ మోహన్ రెడ్డి పట్టణాల అభివృద్ధికి మరియు మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా నిధులు కేటాయించడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి నోచుకోకుండా ఉన్న ప్రాంతాలను ఆ నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు వైఎస్ఆర్సిపి నాయకులు తెలిపారు. ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ మరల వైసీపీ ప్రభుత్వాన్ని నిర్మించే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మచిలీపట్నం మేయర్ మోక వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.