బెల్లంతో ఎంతో ఆరోగ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు. గ్లాస్ బెల్లం పానకంలో కొన్ని తులసి ఆకులు వేసి కాసేపు పక్కన పెట్టి ఈ మిశ్రమాన్ని రోజుకు 3సార్లు తీసుకుంటే పొడి దగ్గు తగ్గుతుంది. కొన్ని కాకర ఆకులు, 4 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని మిరియాల గింజలు, చిన్న బెల్లం ముక్క వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు 2సార్లు వారం రోజులు తీసుకుంటే స్త్రీలలో నెలసరి సమస్యలు తగ్గుతాయంటున్నారు.