గుట్టు చప్పుడు కాకుండా రహస్యంగా క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న ముఠాను పెదకాకాని పోలీసులు ఆదివారం రాత్రి అదుపులో తీసుకున్నారు. వీరి వద్ద నుంచి నాలుగు లక్షల 30 వేల నగదు తో పాటు మూడు ల్యాప్ టాప్ లు, 24 కీప్యాడ్ సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పెదకాకాని సిఐ సురేష్ బాబు తెలిపారు. నంబూరు శివారు జాతీయ రహదారి పక్కనే ఉన్న ఐజేఎం రెయిన్ ట్రీ పార్కులో అపార్ట్మెంట్లో గత కొంతకాలంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు సమాచారం అందటంతో ఆదివారం రాత్రి అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 1007 పై దాడి చేసి ఆరుగురు వ్యక్తులను అదుపులో తీసుకున్నట్లు తెలిపారు. నిందితులను పెదకాకాని పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నట్లు సిఐ తెలిపారు.