తల్లిదండ్రులు దైవసమానులని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఈమని వెంకట గిరికుమారి అన్నారు. ప్రభుత్వ ఆదేశాలనుసారం రేపల్లె పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాలలో ఆదివారం నిర్వహించిన తల్లిదండ్రుల దీవెన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. స్వచ్ఛమైన మనస్సుతో తల్లిదండ్రులు తమ చిన్నారులు బంగారు భవిష్యత్ బాగుండాలని ఆశీస్సులు అందిచటంతో పాటు పెద్దవారిని గౌరవించటం, కుటుంబ బాంధవ్యాలు బలపడటం జరుగుతాయన్నారు.