మార్చి 13వ తేదీన జరుగుతున్న గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్ర దిశనే మార్చబోతున్నాయని తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవికి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కంచర్ల శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. సోమవారం కందుకూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్లోని పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్న శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గపాలనను అంతమొందించడానికి, రాష్ట్ర భవిష్యత్తును చక్కదిద్దడానికి పట్టభద్రులు, టీచర్లు అందరూ తమ ఓటు హక్కును ఒక ఆయుధంగా వినియోగించాలని విజ్ఞప్తి చేశారు.