పటిష్ట బందోబస్తు మధ్య ఉత్తరాంద్ర పట్టభద్రుల ఎన్నిక ప్రశాంతంగా జరుగుచున్నది. సోమవారం ఉదయం ధర్మవరం అగ్రహారం మండలపరిషప్ ప్రాధమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ 188 నందు పటటభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యస్ రాయవరం మండల పరిధిలో 1180 మంది పట్టభద్రులు ఓటు కలిగి ఉన్నారు. నిర్ణీత సమయానికి ఓటింగ్ ను అధికారులు ప్రారంభించగా ఎన్నికల సరళిని స్థానిక డిప్యూటి తహశీల్ధారు శ్యామ్ కుమార్, యంపిడివో రామచంద్రమూర్తి పర్యవేక్షించారు. స్థానిక యస్ ఐ పి ప్రసాదరావు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.