కొయ్యూరు మండల కేంద్రంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఓటు వేసేందుకు మండలంలోని పలు గ్రామాల నుంచి పట్టభద్రులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో అరకు ఎంపీ గొడ్డేటి. మాధవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఎంపీ మాధవి మాట్లాడుతూ. ఉత్తరాంధ్ర నుంచి వైకాపా బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి సుధాకర్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.