ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు, నోట్లతో సీట్లు గెలవాలని సీఎం జగన్ ఆరాటపడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో అధికార నేతలు ఓటుకు రూ.1000 నుంచి రూ.5 వేల వరకు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ఉపాధ్యాయులంటే జగన్కు గౌరవం లేదన్నారు. ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఆత్మాభిమానాన్ని డబ్బుతో కొనాలని చూసే జగన్కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని ఆయన ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. టీడీపీ, పీడీఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.