పార్లమెంట్ ఉభయ సభల్లో ఈరోజు విపక్షాలు నిరసన చేపట్టాయి. బీఆర్ఎస్, ఆప్ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఈడీ, సీబీఐలను కేంద్రం దుర్వినియోగం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై చర్చ చేపట్టాలని వాయిదా తీర్మానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో లోక్‌సభను స్పీకర్ బిర్లా మధ్యాహ్నం 2 గంటల వరకు ఉభయ సభలను వాయిదా వేశారు. పార్లమెంట్ విగ్రహం ముందు కూడా విపక్షాలు ధర్నా చేపట్టాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa