తన ఇన్స్టాగ్రామ్లో అసభ్యకర సందేశాలు పోస్ట్ చేస్తూ వేధిస్తున్న యువకుడికి ఓ మహిళ దేహశుద్ధి చేసింది. ఈ సంఘటన శనివారం సాయంత్రం నెల్లూరు జిల్లా, కావలి ఏఎం బేకరీ సమీపంలో జరిగింది. ఆ మహిళ ఇన్స్టాగ్రామ్కు నెల రోజులుగా అసభ్యకర సందేశాలు పంపుతున్న యువకుడ్ని గుర్తించిన ఆమె 10 రోజులుగా అతని అడ్రస్ కోసం పట్టణంలో గాలింపు చేపట్టింది. ఏఎం బేకరీ సమీపంలో టీ దుకాణంలో పనిచేసే యువకుడిగా గుర్తించి చొక్కాపట్టుకుని చెప్పుతో కొడుతూ దేహశుద్ధి చేసింది. ఆమె తెగువకు రోడ్డున పోయేవారు సైతం ఆశ్చర్యపోయారు. ఈ విషయమై పోలీసులకు ఎలాంటి సమాచారం అందలేదు.